Boinapalli Vinid Kumar | కథలాపూర్, జనవరి 18: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మార్కెఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ ఇటివలే మృతిచెందారు. కాగా ఆదివారం కథలాపూర్ మండలకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నర్సవ్వ ద్వాదశ దినకర్మ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీనరసింహరావు, ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, జగిత్యాల మాజీ జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, కరీంనగర్ ప్రముఖ వైద్యులు బీ ఎన్ రావు, నియోజకవర్గ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, జగిత్యాల మాజీ జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణరావు, కథలాపూర్ మాజీ ఎంపీపీ జవ్వాజి రేవతి, మాజీ జడ్పీటీసీ, చింతకుంట సర్పంచ్ నాగం భూమయ్య పాల్గొని నర్సవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
వారి వెంట సర్పంచ్ బద్దం మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి, వర్ధినేని నాగేశ్వర్రావు, గండ్ర కిరణవు, గుండారపు గంగాధర్, నాంపెల్లి లింబాద్రి. ఎం.డీ. రఫీ, విద్యాసాగర్‌రావు, చందుర్తి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, మిర్యాల వెంకటేశ్వర్రావు, సాయిరెడ్డి, రాజేశ్, రిక్కల సంజీవ్ రెడ్డి, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, ఏజీబీ మహేందర్, పూండ్ర జనార్ధన్‌రెడ్డి. తీట్ల శంకర్, వినోర్రావు, గంగారెడ్డి, శేఖర్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, స్వాగత్ చారి, ఓంకార్, తిరుజాని,తదితరులు పాల్గొన్నారు.