
సీఎం కేటీఆర్, సీఎం కేటీఆర్ అంటూ ఫ్లెక్సీ ప్లకార్డులు పట్టుకొని నాయకులు నినదించారు. భారీ కార్యకర్తల సందోహం మధ్య కాన్వాయ్ తో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆయనకు మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో స్వాగతం పలికి వీర తిలకం దిద్దారు. వారంతా కేటీఆర్ తో ఫొటోలు దిగారు. క్రేన్ వద్దకు చేరుకోగానే ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి కేటీఆర్ కు గజమాలను వేసి సన్మానించారు. అనంతరం కేటీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అభివాదం చేసి లక్షెట్టిపేటకు తన కాన్వాయ్ లో బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, పలువురు డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు మోతే కనకయ్య, మంద శ్రీనివాస్, సంకసాని సౌజన్య సతీష్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ తాజా మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, ఆర్బీఎస్ మాజీ మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య, జిల్లా మాజీ సభ్యులు పూస్కురు రామారావు, ఎగ్గేల స్వామి, మహిళా నాయకురాళ్లు ఆవుల లత, దేవి రేణుక, కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, మర్రి మమత, గుజ్జేటి కనక లక్ష్మి, నాయకులు నలినీకాంత్, దేవి రమణ, దేవి వంశీకృష్ణ, బొడ్డు రాములు, కూరపాటి శ్రీనివాస్, నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, గంధం తిరుపతి, అజ్మీర మల్లేశం నాయక్, సల్వాజి మాధవరావు ,భూక్య రాజు నాయక్, కారుపాకల రాజయ్య, బండవరం సుమన్, ఆవుల శ్రీనివాస్ ,ఆవుల వేణు, రెడపాక శ్రీనివాస్, ఆకారి సత్యం, అయిత వెంకటస్వామి, నారా ప్రేమ్ సాగర్, బండి సురేష్, బాలసాని లింగయ్య, నేరెళ్ల చిన్న లచ్చయ్య, సాన రాజేందర్, అమరపల్లి నారాయణ, గొడుగు మల్లయ్య, పంజాల శ్రీనివాస్, లాలయ్య, గాండ్ల నర్సయ్య, చల్ల గంగారెడ్డి, సులిగే శేఖర్, రాగుల చిన్న మల్లేశం తదితరులు పాల్గొన్నారు.