Koppula Eswar | రామగుండం : తెలంగాణ ఉద్యమ కారులుగా పేరుగాంచిన బీఆర్ఎస్ నేత గోపు అయిలయ్య యాదవ్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన పార్థీవ దేహానికి గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమీనగర్ ఉన్న అయన నివాసం నుంచి నిర్వహించిన అంతిమయాత్రలో కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి, టీజీబీకెఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, పెంట రాజేష్, మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, పలువురు నేతలు పాల్గొన్నారు.