BRS | ధర్మారం, అక్టోబర్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సంక్షేమ శాఖ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బంద్ కార్యక్రమంలో పాల్గొని మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపు నిర్ణయానికి బి ఆర్ ఎస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.
బీసీ ల అభ్యున్నతికి కట్టుబడి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో పదేండ్లు అనేక అభివృద్ధి ,సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిశా దిశా లేని తొందర పాటు నిర్ణయాలు తీసుకొని బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. అటు కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కూడా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తు బీసీలను నయవంచన చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ,బిజెపి పార్టీలు బీసీ లను ఓటు యంత్రాలుగా వినియోగించుకుంటూ దగా చేస్తుందని ఆయన మండి పడ్డారు.
కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి నేడు అదే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు హైకోర్టులో కోర్టులో కేసులు వేసి బీసీ ల గొంతు కోసారని ఆయన ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ , బిజెపి పార్టీలు బీసీ ల పై కపట ప్రేమను మాని చిత్తశుద్ధితో రిజర్వేషన్ల అమలకు కృషి చేయాలని లేని పక్షంలో బీసీ సంఘలతో కలసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ లను హెచ్చరించారు. అంతకుముందు ధర్మారంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ – రాయపట్నం రహదారిపై పార్టీ నాయకులు రాస్తారోకో చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు పూస్కురు రామారావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్,దోనికేని తిరుపతి, గ ఉపాధ్యక్షులు నాడెం శ్రీనివాస్, చింతల తిరుపతి, మాజీ ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, మిట్ట తిరుపతి, కాంపెల్లి చంద్రశేఖర్, పార్టీ మండల నాయకులు గుజ్జెటి కనకలక్ష్మి, ఆవుల లత, మోతే కనకయ్య, ఎండి షరీఫ్, సులిగే శేఖర్ ,నలిగేటి కుమార్, సంధినేని కొమురయ్య, మిట్ట భరత్, బెల్లాల లక్ష్మణ ప్రసాద్, లచ్చయ్య ,బైరి సురేష్, ఆవుల శ్రీనివాస్, గంధం తిరుపతి, దేవి రమణ, అయిత వెంకటస్వామి, దేవి రాజేందర్, దేవి అజయ్, రాగుల చిన్న మల్లేశం, గోల్ల సంతోష్, గుమ్ముల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.