BRS dharna | రాయికల్, ఆగస్టు 25 : రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం రైతులలో కలిసి నాయకులు ర్యాలీగా వెళ్లి మండల వ్యవసాయ అధికారి వినతి పత్రం అందజేశారు.
రైతులకు యూరియా బస్తాలను ప్రైవేట్ డీలర్లు ఎక్కువ రేటుకు అమ్మతూ అదనంగా గడ్డి ముందులను వివిధ రకాల నాసిరకపు మందులను తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో రైతులకు అధిక భారం పడుతుందని, కావున దీన్ని నివారించి వెంటనే రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బర్కం మల్లేష్, ఎలిగేటి అనిల్ కుమార్, మండల కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, మైనార్టి అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయి కుమార్, శ్రీరాముల సత్యనారాయణ, నాయకులు సంతోష్ రావు, ఎలుగందుల లింగం గౌడ్, ప్రశాంత్ రావు, సుతారి తిరుపతిరెడ్డి, సత్యం గౌడ్, జాన గంగాధర్, చిలుక శ్రీను, బనావత్ వెంకటేష్, భూక్య లక్ష్మి, ముద్దం నారాయణ, దరావత్ శ్రీను, రాజేశం, అలుపట్ల లక్ష్మణ్, జలపతి రెడ్డి, ఆకుల నరేష్, సంజీవ రెడ్డి, దువ్వక సురేష్, కాయితి సంజీవ్, వినోద్, నరేష్, చిన్నా, గంగారెడ్డి, ఆశాలు, గంగమల్లు, మోహన్, రైతులు పాల్గొన్నారు.