గంభీరావుపేట, డిసెంబర్ 8 : మండలంలోని రాజేశ్వర్రావునగర్లో కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బీఆర్ఎస్పై అభిమానంతో నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు నాలుగేళ్ల క్రితం గద్దెను ఏర్పాటు చేసి దానిపై కారు ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ఆ కారును తీసేయాలని ఎంపీడీవో తెలుపడంతో స్థానిక నేతలు దానిని తొలగించారు. అయితే, వారం గడవక ముందే గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
దీంతో కూల్చిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్ పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ గద్దెను కూల్చినంత మాత్రాన కేసీఆర్, కేటీఆర్, కారు గుర్తును ప్రజలు సులువుగా మరచిపోలేరని చెప్పారు. ఆయన వెంట నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, కమ్మరి రాజారాం, పిట్ల బాబు, హన్మంతరెడ్డి, నర్సింహులు, ఎర్ర రామాంజగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, అశోక్, సురేందర్, సతీశ్, రాజిరెడ్డి ఉన్నారు.