మోసపోతే గోసపడుతం
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మోసపోతం. మోసపోతే గోసపడుతం.. బీఆర్ఎస్ అంటే వెలుగులు.. కాంగ్రెస్ అంటేనే చీకటి. ఏది కావాలో మీరే ఆలోచించి ఓటేయండి” అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు.
- బీఆర్ఎస్ అంటే వెలుతురు..
- కాంగ్రెస్ అంటే చీకటి ఏది కావాలో ఆలోచించండి
- సంక్షేమానికి చిరునామా కేసీఆర్
- సబ్బండ వర్గాల ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి
- అభివృద్ధి చేసిన.. మరోసారి ఆశీర్వదించండి
- చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్
- రామడుగులో ఎన్నికల ప్రచారం
చొప్పదండి, (రామడుగు) నవంబర్ 14 : “కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మోసపోతం. మోసపోతే గోసపడుతం.. బీఆర్ఎస్ అంటే వెలుగులు.. కాంగ్రెస్ అంటేనే చీకటి. ఏది కావాలో మీరే ఆలోచించి ఓటేయండి” అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం రామడుగు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బిడ్డనైన తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. గతంలో స్థానికేతరులు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని, తాను పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటున్నానని, ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను విరించారు. బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మరళీకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కృష్ణారెడ్డి, వివేకానంద, నాయకులు పుడూరు మల్లేశం పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

