కమాన్‌పూర్, జూన్ 2 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కమాన్‌పూర్ మండల కేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద పటాకలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మగాని అనిల్, ఉప్పరి శ్రీనివాస్, పొన్నం రాజేశ్వరి, నీలం సరిత, తాటికొండ శంకర్, కొండా వెంకటేశ్, ఆకుల గట్టయ్య, గుర్రం లక్ష్మీమల్లు, నీలం శ్రీనివాస్, రాచకొండ రవి, బొల్లపల్లి శంకర్ గౌడ్, జాబు సతీశ్, సాగర్ల పవన్, గుడిసెల లింగస్వామి, మేకల సందీప్ యాదవ్, తోట రాజ్‌కుమార్, అకినెపల్లి సుధాకర్, రవి పాల్గొన్నారు.