Julapalli | హామీలు తీర్చాలని జూలపల్లిలో బారులు తీరిన బీఆర్ఎస్ శ్రేణులు
కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. 'వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల'ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పిలుపుమేరకు పార్టీ కార్యకర్తలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావాణిలో సోమవారం దరఖాస్తులు ఇవ్వడానికి బారులు తీరారు.
Julapalli | జూలపల్లి, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ‘వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాల’ను ఎండగడుతూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పిలుపుమేరకు పార్టీ కార్యకర్తలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావాణిలో సోమవారం దరఖాస్తులు ఇవ్వడానికి బారులు తీరారు. మందోట ఏరియాలోని శ్రీ రావుల మల్లికార్జున స్వామి ఆలయం నుంచి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు, రైతులు, రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి ఒక్కో దరఖాస్తు చొప్పున ఎంపీడీవో పద్మజకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఇన్చార్జి తమ్మ డవేని మల్లేశం, ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, మాజీ సర్పంచులు పొట్టాల మల్లేశం, గుడిశెల రవి, నాయకులు పొలగాని సతీష్, చొప్పరి శేఖర్, కొత్త శ్రీధర్, పూరెల్ల గంగయ్య, లక్కాకుల శ్రీనివాస్, కొమ్ము మల్లేశం, లాల్ మహ్మద్,సంకెళ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Julapalli
- Peddapally
- Ramagundam
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

