Muttharam | ముత్తారం, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ నోటీసులు జారీ చేసిందని బీఆర్ఎస్ మండల శాఖ ఆగ్రహించింది. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో అడవిశ్రీరాంపూర్ రాస్తాలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆరు పథకాలు గోవిందా.., కాంగ్రెస్ ప్రభుత్వం గోవిందా.., కళ్యాణ లక్ష్మి గోవిందా.., రైతు బంధు గోవిందా.. అంటూ కళాకారులు పాటల రూపంతో వర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలతో హోరేత్తించారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు తీసుక వస్తుండగా అక్కడే బందోబస్తుగా ఉన్న ఎస్ ఐ రవి కుమార్ తో పాటు సిబ్బంది అడ్డుకున్నారు.
చివరకు దిష్టిబొమ్మను పోలీసులు విచ్చిన్నం చేశారు. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజీరెడ్డి, మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు నూనే కుమార్, సర్పంచ్ లు సూధాడి రవీందర్ రావు, అత్తే చంద్రమౌళి, మండల బీఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, మండల నాయకులు, అధిక సంఖ్యలో బీఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులకు యూరియా బస్తా ఇవ్వని చేతగానీ ప్రభుత్వం : పోతిపెద్ది కిషన్ రెడ్డి
రైతులకు యూరియా బస్తా ఇవ్వడానికి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని మండిపడ్డారు. ఇప్పటికే మాయమాటలతో ప్రజలను దగా చేస్తుందని ఈ మోసకారి ప్రభుత్వాన్ని రానున్న కాలంలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెబుతారంటూ హెచ్చరించారు.