
Veenavanka | వీణవంక, జనవరి 23: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్-2026కు ముఖ్య అతిథిగా ఎస్ఐ ఆవుల తిరుపతి హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు.
సెల్ఫోన్లు చూస్తూ సమయాన్ని వృథా చేయొద్దని, క్రీడామైదానంలో గడపాలని అన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్‌ను ఏర్పాటు చేసిన కేరళ ఇంగ్లీస్ మీడియం యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.