Breaking news | ముత్తారం : బడి బస్సు, కూలీల ఆటో ఢీ కొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ముత్తారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన వివరాలు తెలుకుంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.