Dasari Prashanth Reddy | పెద్దపల్లి, అక్టోబర్25: ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్‌లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ ద్వారా దాదాపుగా 200 మందికి అల్పాహారాన్ని అందించామని ఆ కళాశాల అకాడమీ డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు అయురారోగ్యాలు ఉండాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ సతీష్ గౌడ్, చొప్పరి వంశీ, అన్వేష్, లవణ్, రాజిరెడ్డి, చందు, సంపత్, శ్రీకాంత్, లైన్స్ క్లబ్ సభ్యులు రాంకిషన్, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.