Hockey selections | హుజూరాబాద్ లో బాల బాలికల హాకీ సెలక్షన్స్ ప్రారంభం
బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు.
Hockey selections | హుజురాబాద్ రూరల్, నవంబర్ 3 : బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్ మాట్లాడుతూ సుమారుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 170 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులోనుండి అండర్-17, అండర్-14 బాల, బాలికల జిల్లా జట్లను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారు వనపర్తి లో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు తెలిపారు.
గత సంవత్సరం అండర్-14 హుజురాబాద్ లో నిర్వహించగా అండర్-14 బాలికల జట్టు గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఎంపికైన క్రీడాకారులు జిల్లాకి గోల్డ్ మెడల్ తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా హాకీ ఎస్జీఎఫ్ కన్వీనర్ వేముల రవికుమార్, పీఈటీలు సత్యానంద్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, అనిల్, శేఖర్ హుజురాబాద్ మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ క్లబ్ సెక్రటరీ తిరుపతి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు శ్యాంసుందర్, శంకర్, సజ్జు, సాయి కృష్ణ, రాజేష్, విక్రమ్, సాంబ, వంశీ, పరబ్రహ్మంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

