Siddipet-NTPC Accident | జ్యోతినగర్, ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లా పరిధిలో గజ్వేల్ రింగ్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఎన్టీపీసీ పట్టణం మూడో డివిజన్ న్యూ పోరాటపల్లి వాసి- కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బిణేష్ ఉన్నారు. మరో వ్యక్తి లింగమూర్తి సోదరుడు మెరుగు మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు హైదరాబాద్‌లో పని నిమిత్తం గురువారం రాత్రి ఎన్టీపీసీ నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బిణేష్ అక్కడికక్కడే మరణించారు.
లింగమూర్తి సోదరుడు మెరుగు మహేష్‌కు రెండు కాళ్లు విరిగిపోవడంతో తీవ్రంగా గాయ పడ్డారు. ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించారు. కారు వేగంగా లారీని ఢీ కొట్టడంతో మామాఅల్లుళ్లు ఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఎన్టీపీసీలోని బాధితుల ఇండ్లలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి.