Field Trip | సుల్తానాబాద్ రూరల్, మార్చి 8 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు తులా సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం విద్య, వైజ్ఞానిక విహారయాత్రకు వెళ్లారు.
ఇందులో భాగంగా కరీంనగర్ లోని రైల్వే స్టేషన్, పురవస్తు ప్రదర్శనశాల, ఎలగందుల ఖిల్లా డిపార్క్, ఉజ్వల పార్క్, తీగల వంతెన, మానేరు డ్యాం, తదితర ప్రదేశాలను సందర్శించారు. విద్యార్థులు సంతోషంగా ప్రదేశాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.