Peddapur | బో’నమో’ మల్లన్న.. పెద్దాపూర్ లో ఘనంగా మల్లన్న బోనాల జాతర
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బోనాలను సమర్పించారు.
Peddapur | మెట్ పల్లి రూరల్, మార్చి 8: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బోనాలను సమర్పించారు. ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లన్న స్వామి రథోత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. కాగా అంతకు ముందు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తదితరులు మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

