Manthani | మంథని, జనవరి 14 : మంథని పట్టణంలోని భగత్‌నగర్‌లోని శ్రీ చెన్న పర్వతాల మల్లన్న స్వామి దేవాలయంలో భక్తులు బుధవారం బోనాల వేడుకలు నిర్వహించారు. ఒగ్గు పూజారులు పసుపు బండారి, డోలు వాయిద్యాల మధ్య శ్రీ మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వార్డులోని మహిళలంతా స్వామి వారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మల్లన్న స్వామి బోనాల సందర్భంగా శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించుకోవడంతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భగత్‌నగర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.