కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం
‘బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం.. మరోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.. ఒక వేళ కాంగ్రెస్, బీజేపీకి అవకాశమిస్తే గోసపడుతాం’.. అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.
- బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
- ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం
- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే గోసపడుతాం
- వేములవాడలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
- చల్మెడను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
‘బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం.. మరోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.. ఒక వేళ కాంగ్రెస్, బీజేపీకి అవకాశమిస్తే గోసపడుతాం’.. అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
– వేములవాడ, నవంబర్ 23
వేములవాడ, నవంబర్ 23: బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన వేములవాడలో పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఇం టింటా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం సాధించుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కరెంటు దికు ఉండదని అవహేళన చేసిందన్నారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెం టు, కృష్ణ, గోదావరి జలాలపై ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. నేటి యువతరానికి కరెంటు ఉండాలనేది బాధ్యతగా తెలిసిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనతోనే అని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకు లు ఇవన్నీ వట్టి ఖర్చులని.. నిరుపేద బలహీన వర్గాలకు అందుతున్న పథకాలపై అవహేళనగా మాట్లాడుతున్నారని, వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు.
1,056 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ 35 మెడికల్ కాలేజీలు పెట్టి ఏడాదికి పదివేల మంది డాక్టర్లను తయారు చేసి సమాజానికి అందిస్తున్నారని కొనియాడారు. ఒకప్పుడు మోకాలు కీలు మార్పిడి వంటి ఆపరేషన్లు అమెరికా వంటి ఉన్న త దేశాల్లో జరిగేవని, సీఎం కేసీఆర్ పాలనలో వేములవాడ వంటి పట్టణంలో ప్రభుత్వ దవాఖానలో జరుగుతున్న తీరే అభివృద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి ప్రభుత్వాలను మహిళలే కాపాడుకోవాలని చెప్పారు.
కాంగ్రెస్ బీజేపీకి ఓటేయవద్దు
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కపట ప్రేమతో మీ ముందుకు వస్తున్నారని, వారిని నమ్మి మోసపోయి ఓటేయవద్దని కోరారు. ప్రేమ లేదని పార్టీ లల్లో ఉండడం వల్లనే ఆది శ్రీనివాస్ ఓటమి చవి చూస్తున్నాడని అన్నారు. వం ద సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ మాధవి, కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణి, ఎంపీపీ మల్లేశం, కో ఆప్షన్ సభ్యుడు కటూరి శ్రీనివాస్, నాయకులు రామతీర్థపు హరీ శ్, తీగల వెంకటేశ్వర్రావు, రామతీర్థపు రాజు, ముప్పిడి శ్రీనివాస్, గోపు బాలరాజు, రాంబాబు, సత్యనారాయణరెడ్డి, కృపాల్ పాల్గొన్నారు.
అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
వేములవాడ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్త. ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధితోపాటు మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్త. వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుత. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్త. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

