కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 7 : వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ, ఫిజీషియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కశ్మీర్‌గడ్డ ఐఎంఏహాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిరుపేదలకు అవసరమయ్యేలా ప్రభుత్వ దవాఖాన బ్లడ్ బ్యాంక్‌కు 41 యూనిట్ల రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేశ్ మాట్లాడుతూ, తల్లీబిడ్డల ఆరోగ్యంతోనే ఆశాజనక భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలని, అందుకు సరిపడా పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, సెక్రటరీ నవీన్‌కుమార్, ట్రెజరర్ విజయ్‌కుమార్, స్త్రీల వైద్యురాలు జీబీ మాధవి, పిల్లల వైద్యుడు జీ రాంమోహన్, ఫిజీషియన్లు విజయ్ మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రఘురామన్, చైతన్య, శ్రీలత, బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి ఉషా ఖండల్, రవికాంత్, అజయ్ ఖండల్ పాల్గొన్నారు.