World Nurses Day | జగిత్యాల, మే 12 : ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ అధికారులు, టిఎన్ఓఏ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ దావాఖానాలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 30 మంది జిల్లాలోని నర్సింగ్ అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ విభాగంలో చేసిన సేవలను గుర్తించుకొని కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుగా చేసిన సేవలకు గుర్తింపుగా తన పుట్టిన రోజున ప్రపంచ నర్సెస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలంగాణ నర్సెస్ అధికారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి కిరణ్, జిల్లా జనరల్ సెక్రెటరీ సుజన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ దామోదర్, జాయింట్ సెక్రెటరీ రాజేందర్, రాష్ట్ర, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శేఖర్, అడ్వైజర్ వెంకట్ సుబ్బయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.