Block level sports competitions | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో మై భారత్, పెగడపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల మహిళలు, పురుషులకు సంబందించి వలీబాల్, కబడ్డీ, రన్నింగ్, షార్ట్ ఫుట్, బ్యాట్మెంటన్, చెస్ టోర్నీలు నిర్వహించడం జరుగుతందని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు 78937 53885 లేదా 98401 26615 నంబర్లకు కాల్ చేసి తమ పేరును ముందుగా నమోదు చేసుకోవాలని వారు కోరారు.