బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు పసుల బాబు
sirisilla | సిరిసిల్ల టౌన్, మార్చి 27: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్ర పాలకులను తరిమిన నాయకుడు సిద్ధం వేణు పట్ల బీజేపీ నాయకులు మాట్లాడిన తీరు సరిగా లేదని, వారు మాట్లాడిన తీరు సంహించేది లేదని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు పసుల బాబు అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలతో తన జాతీయ పార్టీ స్థాయిని తగ్గించుకున్నారని విమర్శించారు. మా నాయకుడు కేసీఆర్ ఇటువంటి సంస్కారం లేని మాటలు మాకు నేర్పించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి అన్ని పార్టీల నాయకులు కలిసి పనిచేశారని చెప్పారు. డిల్లీలో మాట్లాడాల్సిన నాయకుడు గల్లీలోకి వచ్చి కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడన్నాడని మండిపడ్డారు. బండి సంజయ్ గొప్ప నాయకుడు అని చెప్తున్న మీరు ఆయన పార్లమెంట్లో ఏనాడైనా మాట్లాడడం చూశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. పదేండ్లు కరీంనగర్ ఎంపీగా ఉన్న వ్యక్తి అభివృద్ధిలో శూన్యస్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. కనీసం వార్డు మెంబర్ గా గెలవలేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తులు ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిలువేరి చిరంజీవి, కంచర్ల రవిగౌడ్, మాజీ ఎంపీటీసీ పట్నం శ్రీనివాస్, గుంటి మధు, ముగ్ధం అనీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.