UREA | సారంగాపూర్, ఆగస్టు 23: రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను అంచన వేసిదానికి అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల జీజేపీ అధ్యక్షుడు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ నాయకులు తహసీల్దార్ వహిదొద్దిన్ కు వినతిపత్రం అందజేశారు.
మండలంలోని వివిధ భూసమస్యలు పరిష్కరించాలని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరి చేయాలని, లక్ష్మిదేవిపల్లి గ్రామంలోని ప్రధాన రోడ్డును ఆనుకొని ఉన్న కుంటవద్ద సేప్టివాల్ నిర్మించాలని కోరారు. బీంరెడ్డి గూడెం వెళ్లె ఊర చెరువు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని, లచ్చనాయక్ తండాకు రోడ్డు నిర్మాణం చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, నాగేంధర్, రాజేశ్వర్ రెడ్డి, నగేష్ రెడ్డి, సతీష్, వంశీ, శేఖర్, వెంకటేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.