Veenavanka | వీణ వంక, ఏప్రిల్ 6: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహరాజు, మాజీ మండలాధ్యక్షుడు ఆదిరెడ్డి, నాయకులు పెద్ది మల్లారెడ్డి, ముత్యాల రవీందర్, బాపన్న, రాజిరెడ్డి, దామోదర్, దాసారపు రాజు, అశోక్, ఉడుత కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, బొంగోని ఎల్లా గౌడ్, నవీన్, శంకర్, మహంకాళి శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.