Sultanabad | సుల్తానాబాద్, ఫిబ్రవరి 17 : సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ గా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ సతీమణి అంతటి పుష్పలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా ఏఐఎఫ్బీ అభ్యర్థి అమీరీ శెట్టి శ్రావణి రాకేష్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా ఎంపికైన చైర్పర్సన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అందరు సహకారంతో ముందుకు పోతానని ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.