Valmiki Awasam | జగిత్యాల టౌన్, జూలై 12: జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలు సమీరా ఎనిమిదో పుట్టినరోజు వేడుకలను ఆవాసం విద్యార్థులతో కలిసి శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒకరోజు భోజన వసతి కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మాజీమంత్రి రాజేశం గౌడ్ విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వారి కుటుంబంలో మంచి కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు తోచిన విధంగా సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జీ ఆర్ దేశాయ్, సీనియర్ నాయకులు మానాల కిషన్, గుడాల రాజేశం గౌడ్, నక్కల రవీందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజ్ కుమార్, గుర్రం రాము, హరీష్, గుమ్ముల అంజయ్య, జుంబర్తి శంకర్, కోటేశ్వరరావు, ప్రవీణ్ రావు, అశోక్ రావు, రాజేశ్వర్, క్రాంతి, ఆవాసం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.