Bhubharati Applications | పెగడపల్లి : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. రైతులు చేసుకున్న ప్రతీ దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించాలని, అలాగే మీ సేవా కేంద్రాల సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రవీందర్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఆర్ఐ శ్రీనివాస్, విండో సీఈవో గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.