‘Bhu Bharati’ Applications | భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్
భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
- తంగళ్లపల్లి రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- సమయపాలన, దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు

‘Bhu Bharati’ Applications | కలెక్టరేట్, జులై 7 : భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. రెవెన్యూ శాఖలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ మంగళవారం తంగళ్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, కార్యాలయ పనితీరుపై ఆరా తీశారు.
భూ భారతి, సాదాబైనామా కింద అందిన దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అలాగే కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణ, రికార్డుల భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విధులకు సమయానికి హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ మురళి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్‌ను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలోని గ్రోమోర్, నేరేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఫర్టిలైజర్ యాప్ అమలు, యూరియా నిల్వలు, రైతుల బుకింగ్ వివరాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాగు అవసరాలకు అనుగుణంగా ముందుగానే బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేసిన ఆమె, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని, ఆయిల్ పామ్‌తో పాటు ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

