కొత్తపల్లి/హుజూరాబాద్ టౌన్/తిమ్మాపూర్/గన్నేరువరం, జనవరి 13 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం భోగి సంబురాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. నగరంలోని 33వ డివిజన్లో భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్ రావు సతీమణి అపర్ణాసునీల్రావు ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కొత్తపల్లి మండలం బద్దిపెల్లి స్వయంభూ అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలతోపాటు పాల్గొన్న 55 మందికి ప్రోత్సాహక బహుమతులు అందించారు.
హుజూరాబాద్ పట్టణంలోని సిద్ధార్థనగర్, మారుతీనగర్ సహా పలు కాలనీల్లో భోగి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా ఒక్క దగ్గరికి చేరి భోగి మంటలు వేసి, నృత్యాలు చేశారు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమాల్లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సిద్ధార్థ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి, పీడీ రాజిరెడ్డి, జి రవీందర్, లింగారావు, జయవర్ధన్, మంచికట్ల శ్రీనివాస్, రాజమౌళి, ఎం రాజిరెడ్డి, మహిళలు, పిల్లలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, రామకృష్ణకాలనీ, తదితర గ్రామాల్లో ఇండ్ల ఎదుట మహిళలు ఉదయాన్నే రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నారులు గొబ్బెమ్మలు పెట్టి ఆనంద పడ్డారు. చిన్నారులను భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో సోమవారం రాత్రి భోగి మంటలు వేశారు. పెద్దలు, పిల్లలు భోగిమంట చుట్టూ చేరి సందడి చేశారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో అట్టహాసంగా..
విద్యానగర్, జనవరి 13 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ బ్రాంచి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు కరీంనగర్‌లోని ఐఎంఏ హరితహారం గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హరిదాసు కీర్తనలు అలరించాయి. ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున మహిళా వైద్యులు, సీనియర్ వైద్యులు పాల్గొని సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎనమల్ల నరేశ్, నవీన్‌కుమార్, కోశాధికారి విజయ్‌కుమార్, అలీంతో పాటు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.