Pegadapalle | పెగడపల్లి: పెగడపల్లి మండల బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా అరవల్లి సర్పంచ్ ఉప్పలంచ భవాని-లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా రాచకొండ ఆనందం (కీచులాటపల్లి), ఉపాధ్యక్షురాలిగా కుంటాల వనజ-శ్రీనివాస్ (సంచర్ల) ఎన్నికయ్యారు.
అలాగే కార్యవర్గ సభ్యులుగా కాశెట్టి వీరేశం (లింగాపూర్), ఎల్కటూరి రవి (ల్యాగలమర్రి), ఆసంపల్లి రజిత- రమణాకర్ (నామాపూర్), సలహాదారుగా నామ సురెందర్ రావు (దేవికొండ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం సభ్యులను పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు లోక మల్లారెడ్డి, బండి వెంకన్న, నాయకులు నరెందర్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, సంజీవరెడ్డి, శ్రీనివాస్, తిరుపతి తదితరులు అభినందించారు.