Ravi Shankar | మల్యాల, జూన్ 02: మల్యాల మండలంలోని మానాల గ్రామంలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీరయ్య పట్నాలు, కల్యాణోత్సవం కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ శ్రీ బీరప్ప కామరాతి స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాలకి ఆహ్వానం పలికిన గొల్ల కురుమ ఆలయ కమిటీ సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
పూర్వ కాలం నాటినుండి ఇటువంటి ఆచార సంప్రదాయాలు పాటించడం ఎంతో గొప్ప విషయమని, నేడు ఇటువంటి కార్యక్రమాలు జరపడంలో పల్లెలు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయని, ఆస్వామి అమ్మవార్ల దయతో అందరు సుభిక్షంగా అష్టఐశ్వర్యలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. భీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, నాయకులు ఏడిపల్లి రాజన్న, శేఖర్, రాకేష్, తిరుపతి, కురుమ సంఘము అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షుడు మధు, కురుమ సంఘము కులస్తులు తదితరులున్నారు.