Peddapally | పెద్దపల్లి, అక్టోబర్ 6 : వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో సోమవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అవసరాలకు యూరియా పంపిణీ సంబంధించి పిక్ డిమాండ్ సమయం ముగిసిందని, అధికారులు రిలాక్స్ కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉంటూ రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా నుంచి స్టాక్ పక్క జిల్లాలకు అక్రమంగా తరలి పోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగే దిశగా వ్యవసాయ శాఖ తరపు నుంచి పటిష్ట కార్యాచరణ ఏఈవో (క్లస్టర్) వారీగా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు అంజనీ శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.