BC Sub Plan | ధర్మారం, జనవరి 7 : వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్ఫీ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం సంజీవ్ కోరారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ కు ఆయన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఆయన కోరారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీల కోసం సబ్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల సోషల్ మీడియా కన్వీనర్ ముత్తునూరి అంజి బాబు, భూపల్లి ప్రసాద్, ముత్యాల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.