T Jeevan Reddy | జగిత్యాల, డిసెంబర్ 11: బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుందని, రిజర్వేషన్లు స్థానిక సంస్థలకే పరిమితం కాదన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు, 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించేలా చర్యలు చేపట్టాలని, రాహుల్ గాంధీ ఆలోచనతో 42 శాతం రిజర్వేషన్ తెర పైకి తీసుకువచ్చారన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు 42శాతం రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నాయని, 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మాదిరిగానే 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించబడే విధంగా రాహుల్ గాంధీ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు. గతంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించి, రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలన్నారు.
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పొందలేకపోతున్నామని తమిళనాడులో రిజర్వేషన్స్ అమలు చేస్తున్న విధముగా 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే రాహాల్ గాంధీ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చిందని, సామాజికంగా వెనకబాటు తనానికి గురి అవుతున్న బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 42 శాతం రిజర్వేషన్ అమలుకు అనుకూలమని చెబుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు అచరణలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.
50 శాతం పరిమితి అధిగమించేందుకు 42 శాతం రిజర్వేషన్ అమలును 9వ షెడ్యూల్ లో చేర్చాలని, బలహీన వర్గాల తరపున ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. అన్ని రాజకీయ పార్టీలను సమన్వయ పరిచి, లోకసభ, రాజ్యసభలో చర్చించే అంశంగా లేవనేతల ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అని పేర్కొన్నారు.బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలకి పరిమితమైంది కాదనీ, విద్యా, ఉద్యోగాల్లో అమలు చేయడం ప్రధానమైందని, శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం చొరవ తీసుకోవాలన్నారు.
బలహీన వర్గాల జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం అన్ని రాజకీయ పార్టీలపై బాధ్యత ఉందన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పాలనా కాలంలో కేంద్రం నుండి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందేలా చర్యలు చేపట్టారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.