రాజన్న సిరిసిల్ల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : కులాల పేర్ల మార్పును వచ్చేనెలలో పరిష్కరిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని పే ర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బీసీ కమిషన్ బృందం పర్యటించింది. పిచ్చకుంట్ల, దొమ్మరి, తమ్మలి, బుడబుక్కల తదితర కు లాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం సిరిసిల్ల గీతానగర్‌లో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అందించే బిల్లుకు ప్ర భుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కులం పేరుతో ఇబ్బంది పడుతున్న వారు ఆత్మన్యూనతా భావానికి గురికావద్దని, అండగా ప్రభుత్వం ఉందని భరోసా క ల్పించారు. ఆయా కులాల పేర్ల మార్పు అంశం వచ్చేనెలలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి క రీంనగర్ జిల్లా వ్యాప్తంగా పర్యటించి కులాలతో ఇ బ్బందులు పడుతున్నవారి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు.
త్వరలో మిగిలిన జిల్లాల్లో పర్యటించి వారి సమస్యలను నేరు గా తెలుసుకుంటామన్నారు. బీసీ కులాల బాధ్యులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్లు విజయ్‌ప్రకాశ్‌రావు, మహేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజమనోహర్‌రావు, బీసీ సంఘాల నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, దొమ్మరి కులం పేరు మార్చాలని కులం బా ధ్యులు బీసీ కమిషన్‌కు మొరపెట్టుకున్నారు. తమ కు లం పేరుతో తీవ్ర అవమానాలకు గురవుతున్నామని, తమల్ని ఆదరించడం లేదన్నారు. సమాజంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. తమ కులాన్ని గాడె వంశీయులుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. స్పం దించిన కమిషన్ చైర్మన్ కులాలపై అధ్యయనం చేసేందుకు తాము ఇక్కడికి వచ్చామని, తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వేములవాడ టౌన్, మార్చి 26 : బీసీ కులాల్లోని పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము పర్యటిస్తూ ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బుధవారం వారు బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మితో కలిసి రాజన్నను దర్శించుకున్న అనంతరం వారు ఆలయ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుల గణన సర్వే నిర్వహించి, అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని తెలిపారు. తమ కులం పేరు విద్యాలయాలు, ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి వారు విజ్ఞప్తులు అందజేశారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.