Korutla | కోరుట్ల, అక్టోబర్ 18: పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్బంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. అంతకుముందు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక కార్గిల్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేశారు.
కాగ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నారు. బీసీలకు చట్టసభల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ డిమాండ్ చేశారు. బంద్కు మద్దతుగా బైక్ ర్యాలీ తీసిన బీఆర్ఎస్ శ్రేణులు దుకాణాలను మూసివేయించారు.
కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు జువ్వాడి నర్సింగరావు, శికారి గోపి కృష్ణ, తిరుమల గంగాధర్, శీలం వేణుగోపాల్, అడపు మధు, చెన్న విశ్వనాధం, ఎన్నం రాధ, రాజ్ కుమార్, ఆనంద్, వినోద్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.