Chigurumamidi | చిగురుమామిడి,సెప్టెంబర్ 24: బతుకమ్మ పర్వదినము పురస్కరించుకొని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయలక్ష్మి మండల సమైక్య (సే ర్ఫ్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు, సేర్ఫ్ ఏపిఎం బండారి రజిత, మహిళలతో కలిసి బతుకమ్మను తీసుకువచ్చారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలతో మండల పరిషత్ కార్యాలయం వద్దకు తరలివచారు. మండల పరిషత్ నుండి జూనియర్ అసిస్టెంట్ స్వరూప రాణి, పంచాయతీ కార్యదర్శులతో వేడుకల్లో పాల్గొన్నారు. రెవిన్యూ కార్యాలయం నుండి డిప్యూటీ తాసిల్దార్ స్వరూప రాణి, మహిళా ఉద్యోగులతో తరలి వచ్చారు.
ఆహ్లాద వాతావరణంలో సాగిన బతుకమ్మ వేడుకలు పలువురిని అలరించాయి. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో డిప్యూటీ తాసిల్దార్ స్వరూప రాణి మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ, ఏపిఎం రజిత. ఏఈఓ అఖిల, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ స్వరూప రాణి, పంచాయతీ కార్యదర్శులు స్వర్ణలత, స్వప్న, అమృత వర్షిణి, మంజుల, శ్రీలక్ష్మి, స్వాతి, శ్యామరాణి, రెవెన్యూ ఉద్యోగులు అనిత , శ్వేత, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ వేడుకల్లో ఎంపీడీవో మధుసూదన్, సూపర్డెంట్ ఖాజా మోహినిద్దీన్, మండల వైద్యాధికారి సన్నీల రాజేష్, పంచాయతీ కార్యదర్శి సంపత్ తదితరులు ఉన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసిన మండల పరిషత్ సూపరిండెంట్ ను మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు