Take charge | సుల్తానాబాద్ రూరల్ మే 22: సుల్తానాబాద్ నూతన తాహసీల్దార్ గా బషీరుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ రామచంద్ర రావు బదిలీపై మంచిర్యాలకు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ బషీరుద్దీన్ మాట్లాడుతూ భూభారతి, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అవసరాల కోసం వచ్చేవారు నేరుగా తనను కలవొచ్చని చెప్పారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ తో పాటు ఆర్ఐలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.