Basant Nagar | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కర్మాగారం ఆవరణలో కార్మికులతో ఎస్ఐ మాట్లాడుతూ మారుతున్న కల్చర్‌ను బట్టి పిల్లలు చెడు సహవాసాలకు లోనై గంజాయి డ్రగ్ మత్తు పదార్థాలను సేవిస్తున్నారని, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా సెల్ఫోన్లో జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో గాని 100 నెంబర్ కి కానీ కాల్ చేయాలని ఆయన కోరారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాలు, ట్రాఫిక్ రూల్స్, మహిళా భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.