Dharmaram | ధర్మారం, జనవరి 3 : హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లోఈ నెల 5 నుండి 9 వరకు జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య ( ఎస్ జి ఎఫ్) జాతీయ స్థాయి అండర్ -14 బాలుర వాలీబాల్ జట్టు మేనేజర్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ పాఠశాల పీఈటీ బైకని కొమురయ్య ఎంపికయ్యారు.
ఈ మేరకు కొమురయ్యను నియమిస్తూ తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కే .లక్ష్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా శనివారం పాఠశాలలో కొమురయ్య ను పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఈరవేణి, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.