మాట నిలబెట్టుకున్న రామన్న
మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
- వ్యవసాయ కళాశాలలో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం
- నేడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆవిష్కరణ
సిరిసిల్ల రూరల్, జూలై 5: మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆవిష్కరిం చనున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వ్యవసాయాభివృద్ధికి బాబు జగ్జీవన్‌రామ్ చేసిన కృషిని వివరించారు. కానీ, జగ్జీవన్‌రామ్ కృషిని నాటి కాంగ్రెస్ నేతలు విస్మరించారని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సభలో త్వరలో ప్రారంభించనున్న వ్యవసాయ పీజీ కళాశాలకు బాబు జగ్జీవన్‌రామ్ పేరు పెడతామని ప్రకటించారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

