Gangadhara | గంగాధర, ఏప్రిల్ 5 : సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు మడ్లపల్లి గంగాధర్, కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మీరాజం, కర్ర శ్రీనివాసరెడ్డి, ఉప్పుల గంగాధర్, రాచూరి మల్లేశం, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.