Rudrangi | రుద్రంగి, జూన్ 27: రుద్రంగి మండల ఎస్ఐగా బీ శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఇంచార్జ్ ఎస్ఐ మోతిరాం వేములవాడ టౌను బదిలీ కాగా వేములవాడ టౌన్ ప్రొబిషనరీ ఎస్ఐగా విధులు నిర్వహించిన బీ శ్రీనివాస్ శుక్రవారం రుద్రంగిలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా బీ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ మండల ప్రజలు సహకరించాలని కోరారు.