కరీంనగర్ కలెక్టర్‌గా సీసీఎల్ఏలో సెక్రెటరీగా పని చేస్తున్న బీ గోపి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019 జూలైలో కరీంనగర్‌కు వచ్చిన ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోపాటు దళిత బంధు అమలుకు విశేషంగా కృషి చేశారు. కాగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా 2020 బ్యాచ్‌కు చెందిన ప్రఫుల్ దేశాయ్‌ని నియమించారు. ఆయన ప్రస్తుతం జనగామలో పనిచేస్తున్నారు. అలాగే పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఇటీవల నియామకమైన చెక్క ప్రియాంక సూర్యాపేటకు బదిలీ కాగా, ఆమె స్థానంలో జల్ద అరుణశ్రీ నియామకమయ్యారు.