Korutla| కోరుట్ల, జనవరి 28 : కోరుట్ల పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ కు గులాబీ కండువా కప్పిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాస్ తో పాటు పట్టణానికి చెందిన తోటరాజు, పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ లో చేరుతున్నారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడ్ల మనోహర్, బట్టు సునీల్, గంగాధర్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.