Awareness | మల్లాపూర్, జూలై 4: అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార శాఖ జిల్లా అడిట్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, గ్రామాల నుండి దేశాల వరకు సహకార సంఘాలు విస్తృతంగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీఓ శశికుమార్ రెడ్డి, మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి, సీఈఓలు భూమేష్, రమేష్, రాజేశ్వర్, రవితేజ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.