Legal Services | పెద్దపల్లి రూరల్ జూన్ 11 : చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రాణి అన్నారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో బుధవారం నిర్వహించిన న్యాయవిజ్ఞానసదస్సుకు ఆమే ముఖ్య అతిథిగా హాజరై పలు రకాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయసేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందించే సేవలను, న్యాయసలహాలు పొందాల్సిన తీరుపై వివరించారు.
సదస్సుకు హాజరైన పలువురు న్యాయవాదులు వివిదరకాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జిల్లా కమిటీ సభ్యులు నుచ్చు శ్రీనివాస్ యాదవ్ భానుకృష్ణ, సంకీర్తన, న్యాయవాదులు ఠాకూర్ హనుమాన్ సింగ్, ఝాన్సీ, శరత్ గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి దేవరనేని సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.