Dharmaram ZP School | ధర్మారం, నవంబర్ 11: ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన నంది మేడారం పిహెచ్సి డాక్టర్ అనుదీప్ క్యాన్సర్ వ్యాధి లక్షణాల గురించి వివరించారు.
ఈ వ్యాధి పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ మాలతి రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్, డిస్టిక్ అడ్మిన్ సామ ఎల్లారెడ్డి, రీజియన్ సెక్రెటరీ తలమక్కి రవీందర్ శెట్టి, సెక్రెటరీ భూత గడ్డ రవి, సభ్యుడు కడారి కుమార్, ఉపాధ్యాయులు అంజయ్య, మమత పాల్గొన్నారు.