Mukth Bharath Abhiyan | సారంగాపూర్, మే 21: ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పెంబట్ల గ్రామంలో బుధవారం క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యదికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ అనుమానితులను ఇక్కడే ఎక్కువగా 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, పొగ తాగే వారు, ఆల్కహాల్ సేవించేవారు, పొగాకు తినేవారు, డయాబెటిస్ జబ్బులకు పాల్పడిన వారు న్నారన్నారు.
పూర్వం టీబీ మందులు వాడిన వారికి, వారి సన్నిహితులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోగనిర్ధారణ అయితే ఉచిత మందులతో పాటు పోషణ భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వంద రోజుల కార్యాచరణ లో అన్ని సబ్ సెంటర్స్ కవర్ చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకొని సరైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధా రెడ్డి, సీహెచో కుద్దుష్, మహేష్, కిషోర్, తార, జలజ, సంపూర్ణ, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.